Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Janatha Garage censored with U/A

By   /  August 28, 2016  /  Comments Off on Janatha Garage censored with U/A

    Print       Email

janatha garage 1‘జనతా గ్యారేజ్’ సెన్సార్ పూర్తి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.ఇటీవలె ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం జరుపుకుంది. U / A రేటింగ్ తో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1 న విడుదల అవుతుంది అని మూవీ యూనిట్ తెలిపింది.

InCorpTaxAct
Suvidha

ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇందులో ఓ ప్రధాన పాత్రలో ప్రముఖ మళయాళం నటుడు మోహన్ లాల్ నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో విడుదల కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. ‘సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ యూనిట్ తో పని చేయటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘జనతా గ్యారేజ్’ మూవీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది. ఎన్టీఆర్ కి.. ఆయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథతో చిత్రాన్ని తెరకెక్కించాం. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు’ అని తెలిపారు.

ఈ చిత్రం గురించి నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ మాట్లాడుతూ..’ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాని ప్రతిష్టాత్మకం గా తీసుకుని నిర్మించాం. చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U / A రేటింగ్ వచ్చింది. పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో ప్రపంచవ్యాప్తం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.

సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫి – తిరు . ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ – ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ – ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ – చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్, రచన – దర్శకత్వం – కొరటాల శివ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →