Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Janatha Garage’ Title Song Copied From Ram Charan’s Yevadu?

By   /  August 16, 2016  /  Comments Off on ‘Janatha Garage’ Title Song Copied From Ram Charan’s Yevadu?

    Print       Email

NTR's Janatha Garage Movie First Look Wallpaper

‘జనతాగ్యారేజ్’ టైటిల్ సాంగ్ కాపీనా..?

InCorpTaxAct
Suvidha

 

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘జనతాగ్యారేజ్’ సెప్టెంబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఆడియో వేడుక ఈనెల 12న అంగరంగ వైభవంగా జరిగింది. అతి తక్కువ సమయంలోనే ఈ మూవీ సాంగ్స్ కి సూపర్ క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ విషయంలో ఆశక్తికర చర్చ నడుస్తోంది. టైటిల్ సాంగ్ ని దేవీశ్రీ ప్రసాద్ కాపీ కొట్టేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.

‘జనతా గ్యారేజ్’ టైటిల్ సాంగ్ లిరిక్స్ ని చెర్రీ నటించిన ‘ఎవడు’ సినిమా నుంచి తీసుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ సినిమా ఇంట్రవెల్ సమయంలో వచ్చే బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ నుంచి దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కాపీ కొట్టి ‘జనతా గ్యారేజ్’ టైటిల్ సాంగ్ లా మలిచాడని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే సంగీత దర్శకులు ట్యూన్స్ కాపీ కొట్టడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే.. తాము తీసుకున్న ట్యూన్స్ ఎక్కడవి అని మాత్రం తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాని దేవీ మాత్రం తాను సంగీత దర్శకుడిగా పనిచేసిన సినిమా నుంచే తీసుకుని అందరిని ఆశ్చర్యంలో పడేశాడని సినీ జనం చర్చించుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →