Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

japan’s travel interrupted by TDP supporters in Ananthapur

By   /  June 6, 2016  /  Comments Off on japan’s travel interrupted by TDP supporters in Ananthapur

    Print       Email

Jaganజ‌గ‌న్ కాన్వాయ్‌పై చెప్పులు

 

InCorpTaxAct
Suvidha

 

 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనంత‌పురంలో చేప‌ట్టిన రైతు భ‌రోసా యాత్ర  చివ‌రి రెండు రోజులు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ సాగించింది. చివ‌రి రోజు అయితే అనంత‌పురంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జ‌గ‌న్  చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. జ‌గ‌న్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జ‌గ‌న్ కాన్వాయ్‌కు అడ్డం ప‌డి అడ్డుకునే ప్ర‌య‌త్నంచేశారు. తమ ప్రాంతానికి రావద్దని, ‘జగన్ గో బ్యాక్’ అంటూ కదిరి-ఓడీసీ పట్టణాల మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. అయితే వైసీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో ప్ర‌తిఘ‌టించాయి.  దీంతో టీడీపీ కార్యకర్తలకు, వైసీపీకి కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జగన్‌ గో బ్యాక్‌ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతకు చెందిన ఓ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

రంగంలోకి దిగిన పోలీసు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే చంద్ర‌బాబు నాయుడుకు క్ష‌మాప‌ణ  చెప్పిన త‌ర్వాత యాత్ర చేసుకోవాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేయ‌డంతో  ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని అంద‌రూ టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌వ‌డంతో అనంత‌పురంలో జ‌గ‌న్ కాన్వాయ్‌పై చెప్పులు విసిరి నిర‌స‌న తెల‌ప‌డం తెప్పితే పెద్ద‌గా పెద్ద‌గా ఏమీ జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి.  దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →