Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Jayaho Bharath..India beat Pakistan by six wickets..

By   /  March 19, 2016  /  Comments Off on Jayaho Bharath..India beat Pakistan by six wickets..

    Print       Email

virat kohli

జయహో భారత్.. మళ్లీ పాక్ ను చితక్కొట్టారు..

Suvidha
Biryani Pot

 

హిస్టరీ రిపీట్ అయింది. దాయాది దేశం పాక్ మరోసారి టీమిండియా చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ధోని సేన చెలరేగి ఆడింది. 6 వికెట్ల తేడాతో పాక్ పనిపట్టింది. పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

team india 1టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ విశ్వరూపం చూపించి 55 పరుగులు చేశాడు. యువరాజ్ బ్యాట్ మెరుపులు మెరిపించింది. 24 పరుగులతో జట్టుకు బాసటగా నిలిచాడు. చివరల్లో వచ్చిన ధోనీ 13 పరుగులు , రోహిత్ శర్మ 10 పరుగులు, శిఖర్ ధావన్ 6 పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగలిగింది. షర్జీల్ ఖాన్ 17, అహ్మద్ షెహజాద్ 25 పరుగులు, ఆఫ్రిదీ 8, అక్మల్ 22, షోయబ్ మాలిక్ 26 పరుగులు చేశారు.team india 3

భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. పాక్ బౌలర్లలో సమీ రెండు వికెట్లు తీశాడు. అమీర్, రియాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 55 పరుగులు చేసిన భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Sankranti Event… Some records were broken. Few new ones set!

Read More →