Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Jayalalitha repeated history, she is no less than MGR

By   /  May 20, 2016  /  Comments Off on Jayalalitha repeated history, she is no less than MGR

    Print       Email

Jaya-victory_2859672fఅప్పుడు ఎంజీఆర్‌.. ఇప్పుడు జ‌య‌ల‌లిత‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత చ‌రిత్ర సృష్టించారు. తాను ఏదైతే క‌ల‌లు కంటున్నారో అది నిజం చేసుకున్నారు. త‌మిళ‌నాడుకు 6వ సారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతుండ‌డంతోపాటు గ‌త చ‌రిత్ర‌ను స‌మం చేసి తానేంటో నిరూపించుకున్నారు. త‌మిళులు ఇచ్చిన తీర్పుకు అమ్మ ఫిదా అయ్యారు.  అధికారంలో ఉన్న పార్టీ తదుపరి ఎన్నికల్లో తమ అధికారం నిలబెట్టుకున్న చరిత్ర తమిళనాడులో కొత్తకాదు. స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఎన్నికలు మొదలుకొని 1967 వరకు తమిళనాట కాంగ్రెస్‌ హవా కొనసాగింది. 1967లో అణ్నాదురై నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడి అధికారం చేపట్టింది. అణ్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు. డీఎంకేని వీడి అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్‌ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టి 1980, 1984 ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

ఆ ఎన్నికల తర్వాత ఎంజీఆర్‌ మరణానంతరం జరిగిన ఏ శాసనసభ ఎన్నికల్లోనూ తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. 1984 త‌ర్వాత 1989లో డీఎంకే, 1991లో అన్నా డీఎంకే, 1996 డీఎంకే, 2001లో అన్నా డీఎంకే, 2006లో డీఎంకే, 2011లో అన్నా డీఎంకే విజ‌యం సాధించారు. ఇలా మూడు ద‌శాబ్దాలుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తమిళనాట తిరిగి అధికారం చేపట్టలేదు. ఎంజీఆర్‌ తరువాత 2016లో ఆ రికార్డును జయలలిత తిరిగి లిఖించారు. ప్ర‌తి ప‌థ‌కానికి అమ్మ పేరు పెట్టుకున్న జ‌య‌ల‌లిత ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుంద‌నే చెప్పాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →