Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

JC Divakar Reddy’s target is CM Chandrababu Naidu?

By   /  April 15, 2017  /  Comments Off on JC Divakar Reddy’s target is CM Chandrababu Naidu?

    Print       Email

jc diwakar reddyఅమరావతిలో ప్రజా ప్రతినిధులకు స్థలాలు ఇవ్వండి: ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి

 

InCorpTaxAct
Suvidha

 

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి సాక్షాత్తు సీఎంని, ఓ మంత్రిని టార్గెట్ గా చేసుకున్నారు. అమరావతి అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రి నారాయణకు ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. రాజధాని డెవలప్ కావాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ విషయంలో బ్యాంకులతో టై అప్ కావాలని అన్నారు. కేవలం స్థలాలు మాత్రమే ఇస్తే కొంతకాలం తర్వాత అమ్మేసుకుంటారని అన్నారు.

అలాగే అధికారులకు వారితో పాటు సిబ్బందికి కూడా అమరావతిలో ఇళ్ళు నిర్మించాలని అన్నారు. ఇవన్నీ జరగకపోతే అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యేలకు నిర్మించే ఇళ్లలో దూరం పాటించాలని అన్నారు. దూరం దూరంగా నిర్మిస్తే ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉండదని చమత్కరించారు. కర్నూలు కార్పొరేషన్ ఆఫీసులో మంత్రి నారాయణ, ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →