చిరంజీవి చంద్రబాబు అంటూ సంభోదించిన జేసీ దివాకర్ రెడ్డి..
అనంతపురం జిల్లా పామిడిలో టీడీపీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ దివాకర్ రెడ్డి ప్రసంగించారు. అంతేకాదు చిరంజీవి చంద్రబాబు నాయుడు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తను ఇలా ఎందుకు అన్నారో కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు 68వ జన్మదినోత్సవం అని అన్నారు. తనకేమో 72 సంవత్సరాల వయసు అని చెప్పారు. అందుకే చిరంజీవి చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించానని చెప్పారు.
అలాగే నీటి విషయంలో చంద్రబాబు చాలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. హంద్రీనివా నీటిని మూడు నెలల్లో తెస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావించారు. ఈ పని జరగాలంటే అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరి ఆశీస్సులు కావాలని అన్నారు. అంతకుమించి దేవుడి ఆశీస్సులు ఉండాలన్నారు. ఏపీకి పోలవరం అత్యంత ప్రధానమైన ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నెహ్రు నుంచి చంద్రబాబు వరకు అందరూ కలలు కన్నారని అన్నారు.తన తెలివితేటలతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సాధించడం గొప్ప విశేషమని ప్రశంసించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.