జేసీ మాటల తూటాలు.. బాబు బెంబేలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను నిప్పును.. తాను ఎవరికీ భయపడను అని చెబుతున్నాడు కానీ లోలోప చాలా భయపడిపోతున్నాడని సొంతపార్టీ నేతలే అంటున్నారు. బాబు భయం ప్రతిపక్షాన్ని చూసి కాదని, సొంతపార్టీ నేతలను చూసేనని వారంటున్నారు. మరీ ముఖ్యంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చూస్తే బాబుకు చెమటలు పడుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. జేసీ ఎప్పుడు ఏది మాట్లాడి తన కొంపమీదకు తెస్తాడోనని బాబు భయపడిపోతున్నాడట. తాజాగా జేసీ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే…“ పట్టిసీమతో రాయలసీమకు నీరు రాదు.., ప్రత్యేకహోదా రాదని చంద్రబాబుకు ముందే తెలుసు.., ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇస్తామని బాబు ఆడియోలో ఎక్కడా చెప్పలేదు.., చంద్రబాబు హామీలు ఆచరణలో సాధ్యం కావు.., ప్రత్యేక హోదా పోరాటమా? వంకాయా?.., రూపాయికి కిలో బియ్యం శుద్ధ దండగ“ అంటూ విచిత్రంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరినీ, ఆఖరికి ఆయన వాయిస్ తీసుకునే పాత్రికేయులను కూడా నవ్విస్తూ బాబును మాత్రం ఏడిపిస్తున్నాడట.
దీంతో అటు ముఖ్యమంత్రి సైతం జేసీ తనను పొగుడు తున్నాడో… తిడుతున్నాడో తేల్చుకోలేక పోతున్నాడని బాబు సన్నిహితులు చెబుతున్నారు. తన ఇమేజ్ను పెంచుతున్నాడా..? లేక ప్రజల్లో జేసీ ఇమేజ్ పెంచుకుంటున్నాడా అనే సందేహం బాబులో కలుగుతోందంటున్నారు. అసలు టీడీపీ నుంచి టికెట్ ఎందుకు ఇచ్చానా అని బాబు మథనపడిపోతున్నాడట. ఇదిలా ఉంటే జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం తాను ఇక రాజకీయాల్లో పోటీ చేయనని, అందుకే నిజాలు మాట్లాడుతున్నానని చెప్పడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.