బాబుకు జేసీ కితాబు
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఏమైందో ఏమోకానీ ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాబు లాంటి ముఖ్యమంత్రిని తాను ఇప్పటి వరకు చూడలేదంటూ కితాబులిస్తున్నాడు. తాజాగా అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో రుణ ఉపశమన పత్రాల పంపిణీ సందర్భంగా జేసీ మరోమారు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని గట్టెంచడానికి ఆఖరుకు తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత మనవడిని కూడా ఎత్తుకుని ముద్దు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. మనవడిని ముద్దాడే తీరిక కూడా లేని చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు.
కాగా గతంలో ఓ మారు విజయవాడలో బహిరంగ వేదికపైనే చంద్రబాబు పరిస్థితిని వివరించిన జేసీ తనదైన రీతిలో సానుభూతి కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పొగడ్తలతో ముంచెత్తడంతో అందరినీలో అనుమానాలు మొదలయ్యాయి. జేసీ కేంద్ర మంత్రి పదవి ఆశించే ఇలా చంద్రబాబును పొగిడేస్తున్నాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటూ జిల్లా నాయకులు చర్చించుకుంటున్నారు. జేసీకి కేంద్ర మంత్రి పదవి వస్తుందా రాదో తెలియదు కానీ.. అనంతపురంలో ఇక టీడీపీకి ఇబ్బంది ఉండదని మాత్రం తమ్ముళ్లు ధీమాగా అయితే ఉన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.