Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

JD Lakshmi Narayana Resigns To Enter State Politics

By   /  March 22, 2018  /  Comments Off on JD Lakshmi Narayana Resigns To Enter State Politics

    Print       Email

రాజ‌కీయాల వైపు జేడీ చూపు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

*ఏడీజీపీ ప‌ద‌వికి జేడీ ల‌క్ష్మినారాయ‌ణ వీఆర్ఎస్‌

* మ‌హారాష్ట్ర డీజీపీకి వీఆర్ఎస్ ప్ర‌తుల‌ను స‌మ‌ర్పించిన ల‌క్ష్మినారాయ‌ణ‌

* జ‌న‌సేన‌నా?  సొంత పార్టీనా? అన్న‌ది సందిగ్ధం

డెక్క‌న్ అబ్రాడ్‌: ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించిన విష‌యాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అధికారి జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌. మ‌హారాష్ట్రంలో ఏడీజీపీగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ల‌క్ష్మినారాయ‌ణ వీఆర్ఎస్ తీసుకున్నారు. అంతేకాదు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్న‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  వీలైతే సొంత పార్టీ లేదంటే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి వెళ్లి ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ కథనాలకు తగినట్టుగానే ఆయన తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పొందారు. మహారాష్ట్ర డీజీపీకి తన వీఆర్ఎస్ పత్రాన్ని సమర్పించారు. తన వీఆర్ఎస్‌ను ఆమోదించాల్సిందిగా ఆయన కోరారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన ఏం చేస్తారన్నది చెప్పకపోయినప్పటికీ.. రాజకీయాలవైపే ఆయన అడుగులు పడుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వీలైతే ఆయన సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ అది వీలుకాకపోతే పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీతో పాటు తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యాన ఇప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అంటే ఏడాది పాటు జనాల్లో తిరిగి పటిష్ఠ బేస్‌ను ఏర్పాటు చేసుకుంటే రాజకీయాల్లో తన మార్క్‌ను చూపించొచ్చని భావిస్తున్నారని అంటున్నారు. చూడాలి మ‌రి జేడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్నాది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →