Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Jeevan Reddy slams minister KTR..

By   /  April 19, 2017  /  Comments Off on Jeevan Reddy slams minister KTR..

    Print       Email

jeevan reddyతెలంగాణ మంత్రి కేటీఆర్ పై జీవన్ రెడ్డి విమర్శలు

 

InCorpTaxAct
Suvidha

 

 

 

తెలంగాణలో కాంగ్రెస్ – టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రీసెంట్ గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పై పోటీ చేయడం వల్లే జీవన్ రెడ్డి మంత్రి అయ్యారని కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పబట్టారు. గతంలో కేసీఆర్ కి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఉద్యమం చేసేవారా అంటూ ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పులను బట్టి చూస్తే ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు.

జనహిత సభలు కేవలం అహంకార పూరితంగా నిర్వహిస్తున్నారని అన్నారు. తమ పార్టీ మూడేళ్ల పసిపాప అంటూ చెప్పుకుంటున్నారని అన్నారు. మరి అంతకు ముందు తెలంగాణ అభివృద్ధి ఎలా సాగిందని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎంపీగా గెలిచారని అన్నారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని ఎన్ని సీట్లు గెలిచారో గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని అన్నారు. రైతులకు పునరావాసం ఏర్పాటు చేయకుండా భూములు లాక్కుకుంటున్నారని మండిపడ్డారు.హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కేటీఆర్ ఎందుకు భావించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →