Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Jewelry Chain Kanishk Gold Defrauds 14 Banks To Tune of Rs 1000 Crore

By   /  March 22, 2018  /  Comments Off on Jewelry Chain Kanishk Gold Defrauds 14 Banks To Tune of Rs 1000 Crore

    Print       Email

రూ.1000 కోట్ల భారీ మోసం

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* బ్యాంక్‌ల‌కు క‌నిష్క్ కుచ్చుటోపి

* నీరవ్.. మాల్యా.. లలిత్‌ల తరహాలో భూపేష్ ప‌రార్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: బ‌డా బాబులు బ్యాంకుల‌ను ముంచేస్తున్నారు. వేల కోట్లు అప్పులు తీసుకుని క‌ట్ట‌కుండా విదేశాల‌కు చెక్కేస్తున్నారు. అక్క‌డ వారి వారి కుటుంబాల‌తో ఎంజాయ్ చేస్తున్నారు. నీర‌వ్ మోడీ ఉదంతం మ‌ర‌క‌ముందే తాజాగా క‌నిష్క్‌చేసిన మోసం వెలుగులోకి వ‌చ్చింది. నీర‌వ్ రూ.12వేల కోట్లు పీఎస్‌బీకి కుచ్చుటోపి పెడితే క‌నిష్క్ య‌జ‌మాని భూపేష్ రూ.1000 కోట్లు కుచ్చుటోపి పెట్టారు. అంతేకాదు నీర‌వ్‌..విజ‌య్‌మాల్యా..ల‌లిత్‌మోదీ త‌ర‌హాలోనే భూపేష్ కూడా విదేశాల‌కు వెళ్లిపోయారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. స్వర్ణాభరణాల శృంఖల సంస్థ కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల సమూహానికి సున్నం పూసింది. మొత్తంమీద రూ.824.15 కోట్ల రుణం, వాటిపై వడ్డీసహా వెయ్యి కోట్లకు నామంపెట్టిన ఈ సంస్థ తెల్లారేసరికి దుకాణం మూసేసింది. నీరవ్ మోదీ రూ.12వేల కోట్లకు పీఎన్‌బీకి కుచ్చుటోపీ పెట్టి పారిపోయాకగానీ బ్యాంకు  యాజమాన్యం మేల్కొనలేదు. అదే తరహాలో కనిష్క్ మోసం గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అర్థమయ్యేసరికే దాని యజమానులు పరారయ్యారు. ఈ నేపథ్యంలో తాము రూ.215 కోట్ల మేర మునిగినట్లు ఎస్‌బీఐ నిరుడు నవంబరు 11న రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు నివేదించింది.

ఆ తర్వాత 2018 జనవరి నాటికి మిగిలిన 13 బ్యాంకులు లబోదిబోమంటూ ఆర్బీఐ శరణుజొచ్చాయి. అటుపైన తొలుత ఎస్‌బీఐ చొరవ తీసుకుని సీబీఐకి ఫిర్యాదు చేయడంతో మిగిలిన బ్యాంకులూ దాన్ని అనుసరించాయి. భూపేష్‌కుమార్ జైన్, అతని భార్య నీతా జైన్ ఈ సంస్థకు ప్రమోటర్లు, డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే, వెయ్యికోట్లకు టోకరా వేసిన ఈ దంపతులతో మాట్లాడేందుకు యత్నించినా వారు అందుబాటులో లేరని బ్యాంకులు వాపోతున్నాయి. కాగా, వీరు ప్రస్తుతం పర్యాటక స్వర్గం మారిషస్‌లో మజా చేస్తున్నారని సమాచారం.  కనిష్క్ సంస్థ ప్రధాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని టి.నగర్‌లో ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →