Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

JNU row: Kanhaiya Kumar recounts ordeal, says lawyers beat him but police didn’t do anything

By   /  February 27, 2016  /  Comments Off on JNU row: Kanhaiya Kumar recounts ordeal, says lawyers beat him but police didn’t do anything

    Print       Email

kanhaiiya-kumar-jnu1
పాటియాల హౌస్ కోర్టులో న్యాయవాదులు నాపై దాడి చేశారు: కన్నయ్య కుమార్

పాటియాల కోర్టులో తనపై న్యాయవాదులు దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ఆరోపించారు.ఈ దాడులు ఢిల్లీ పోలీసులు చూస్తుండగానే జరిగాయన్నారు. ఇదిలాఉంటే జేఎన్‌యూ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు, దేశ ద్రోహం కేసు ఎదుర్కున్న కన్నయ్య కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు చూస్తుండగానే పాటియాల హౌస్ కోర్టులో న్యాయవాదులు తనను కొట్టారన్నారు.

InCorpTaxAct
Suvidha

తనపై దాడి చేసిన వారిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు.తనను కొడుతూంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించినా అతనిని అరెస్ట్ చేయలేదన్నారు. మరోవైపు జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్న మరో 22 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య, కలిల్, అనిర్బన్‌లను విచారించిన తర్వాత వీరిని గుర్తించినట్లు వెల్లడించారు. త్వరలోనే అందరినీ విచారిస్తామని చెప్పారు.

ముసుగులు ధరించి నినాదిలిచ్చిన నలుగురు వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. వీసీ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటి నివేదిక.. ఈ విచారణ పురోగతులు కీలకం కానుంది. మరోవైపు పాటియాల హౌస్‌కోర్టులో దాడిపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →