ఐ లవ్ ఇండియా!
మన దేశాన్ని మనం గౌరవించడంలో కొత్తేమి లేదు. కానీ వేరే దేశం వాళ్లు కూడా మన దేశాన్ని గౌరవిస్తున్నారంటే ఇండియాలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఇక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు అంత గొప్పగా వాళ్లు ప్రేమిస్తున్నందుకు సంతోష పడాలి. ఈ కోవకు చెందుతాడు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్. ఆయన భారత్‌ను ఎంతగా ప్రేమిస్తున్నాడనడానికి చిన్న ఉదాహరణ అతని కూతురికి ఇండియా అని పేరు పెట్టుకోవడమే. ఆ పాప బాగుండాలని ఇటీవల కుటుంబ సమేతంగా తమిళనాడులోని అన్నామలై ఆలయానికి వెళ్లి అక్కడపూజలు చేయించారు.
ప్రస్తుతం జాంటీ రోడ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే ఇటీవల ముంబలోని పేజావర్ మఠాన్ని సందర్శించారు. ఇండియా కోసం ప్రత్యేక పూజలు చేశారు. హిందు సంప్రదాయ దుస్తులైన ధోతీ, శాలువ ధరించి ఆయన భారతదేశం బాగుండాలని హోమాలు, యజ్ఞాలు చేయించారంటే అతనికి మనదేశంపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. తాను కుటుంబ సభ్యులతో సహా వెళ్లి పూజలు చేయించిన విషయాలను అందరితో పంచుకోవడానికి ఐ లవ్ ఇండియా అంటూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్టు చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.