Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

JP on article 356 about CM’s appointment

By   /  July 16, 2016  /  Comments Off on JP on article 356 about CM’s appointment

    Print       Email

jpజేపీ ఏం చెప్పారో తెలుసా?

 

InCorpTaxAct
Suvidha

 

జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌.. ఈ పేరు అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ సంచ‌ల‌నం. ఆయ‌న ఏదైనా వార్త రాసినా… ఆయ‌న ఏ వేదిక‌పై నుంచి ఏ వ్యాఖ్య‌లు చేసినా వాటికి ఉండే ప్రాముఖ్య‌త అంతా ఇంతా కాదు. మంచిమేధావిగా కూడా ఆయ‌నకు పేరుంది. ఈ పేరును బాగా వాడుకోవాల‌నుకుని ఉత్సాహంతో రాజకీయ పార్టీ పెట్టేసి.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్నే కాదు.. జాతీయ స్థాయిలోనూ తమ పార్టీ అద్భుతం సాధిస్తుందని చెబుతూ దాదాపు పదేళ్ల కిందట లోక్ సత్తా రాజకీయ పార్టీ పెట్టేశారు. అయితే కొద్ది రోజుల‌కే అది నడపటం తన వల్ల కాదంటూ చేతులెత్తేసిన ఆయ‌న తాజాగా ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. ఆర్టికల్ 356ను నామమాత్రంగా చేసి.. ముఖ్యమంత్రుల్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలంటూ చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై రియాక్ట్ అయిన ఆయన.. సీఎంలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక చేసుకోవాలన్న ఆలోచనను చెప్పారు. అవిశ్వాసం.. బడ్జెట్ సమయాలకే విప్ జారీని పరిమితం చేయటం లాంటి సంస్కరణలు చేపడితే.. అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాల్ని.. నీతి మాలిన రాజకీయాలకుచెక్ చెప్పచ్చని చెప్పుకొచ్చారు. అయితే గ‌తంలో లాగా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ మాట‌లు ఎవ‌రైనా వింటారా అంటే కొంత ఆలోచించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఏదేమైనా జ‌య‌ప్ర‌కాష్ చెప్పే మాట‌లు కొంత‌వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు మేలు చేసేవిధంగా ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →