Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Jr. NTR- Janatha garage is ready to release!

By   /  May 20, 2016  /  Comments Off on Jr. NTR- Janatha garage is ready to release!

    Print       Email

janathaజ‌న‌తాగ్యారేజ్  ఫ‌స్ట్ లుక్స్ అదుర్స్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ స్టార్ జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించే జ‌న‌తా గ్యారేజ్ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది.  ఈ పోస్ట‌ర్‌లో  ఎన్టీఆర్ చాలా ఎన‌ర్జ‌టిక్ క‌నిపిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై అభిమానుల‌తో పాటు ఎన్టీఆర్ కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీ‌మంత్రుడు సినిమా త‌ర్వాత కొర‌టాల శివ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. శ్రీ‌మంతుడు సినిమాలో మ‌హేష్‌ను కొర‌టాల శివ ఎలా చూపించాడో అంత‌కంటే బాగా ఎన్టీఆర్ ను చూపించ‌బోతున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

 

మొన్న మ‌హేష్ బాబు కూడా ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌న‌కు బాగా న‌చ్చిన హీరోల్లో ఎన్టీఆర్ ఒక‌ర‌ని, అత‌ని డ్యాన్స్‌కు తాను ఫిదా అయితాన‌ని చెప్పాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌న‌తా గ్యారేజీ సినిమా మంచి క‌థాంశంతో పాటు డ్యాన్స్‌, పాట‌లు చాలా అద్భుతంగా ఉంటాయ‌ని చిత్ర‌యూనిట్ అంటోంది.  సమంత, నిత్యమీనన్, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషిస్తోన్న జనతాగ్యారేజ్ తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో రిలీజ్‌కానుంది. ఆగస్టు లో జనతాగ్యారేజ్ విడుదల కానున్నట్టు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →