జూన్ 23 సెలబ్రేషన్స్ జరుపుకునే రోజట..! ఎందుకు..?
ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ ఓ మూవీ తెరెకెక్కుతోంది. ఈ చిత్రంపై క్రమంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ జూన్ 23న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి చాలా సస్పెన్స్ నెలకొంది. ఇప్పటివరకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. టైటిల్ పై గతంలో కొన్ని ప్రచారాలు సాగాయి. కాని ఇప్పటికీ ఇంకా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం లేదు. అలాగే ఇప్పటివరకు ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. మరి ఇంత సస్పెన్స్ లోను ఈ మూవీ భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.
ఇలాఉంటే సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ మురుగదాస్ ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు. ఇక మురుగదాస్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు సూపర్ స్టార్ రిప్లై ఇచ్చారు. ‘వెయిటింగ్ సార్, జూన్ 23 అనేది సెలబ్రేషన్స్ జరపుకునే రోజు’ అంటూ మహేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రిన్స్ ట్వీట్ తో ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.