నోట్ల మార్పిడికి ఎన్ఆర్ ఐలకు జూన్ 30 లాస్ట్ డేట్..
నోట్ల రద్దు తర్వాత పాత నోట్లను మార్చుకునేందుకు ఇచ్చి గడువు కాస్తా ముగిసిపోయింది. ఇక చివరిరోజున పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ దగ్గరకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆర్బీఐ శాఖల దగ్గర పలు ఇబ్బందులు పడ్డారు. ఇలా ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, నాగపూర్ ఆర్బీఐ శాఖల దగ్గర జనం బారులు తీరారు. నోట్ల మార్పిడికి చివరి రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. దీంతో జనం బాగా పెరగడంతో ఏకంగా ఏడు గంటల పాటు లైన్ లో వేచి ఉండాల్సి వచ్చింది.ఇక ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి రామ్ మేఘ్ వాల్ స్పందించారు. జనం ఇక్కట్లు పడటానికి కారణం వారు సరైన ధృవీకరణ పత్రాలే తేలేకపోవడమేనని అన్నారు. అందుకే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఇదిలాఉంటే రద్దైన రూ.1000, రూ.500 నోట్లను జమచేసే అవకాశం ఇప్పుడు కేవలం ఎన్ ఆర్ ఐలకు మాత్రమే ఉంది. వీరికి జూన్ 30వరకు జమ చేసుకునే అవకాశం ఇచ్చారు. అదీ కేవలం రూ.25 వేలకు మాత్రమే మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.