నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్న కెఏ పాల్ ట్విట్టర్ కామెంట్స్..
క్రైస్తవ మత గురువు కేఏ పాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు చేస్తూంటారు. ఇలా ఆయన ప్రధాని మోదీ విషయంలో వ్యాఖ్యలు చేశారు. మోదీ గెలుపుకు , డోనాల్డ్ ట్రంప్ గెలుపుకు తానే కారణం అని అన్నారు. తాను ప్రత్యేక ప్రార్ధనలు చేయబట్టే ఇద్దరూ గెలిచారని సెలవిచ్చారు. తాజాగా ఆయన డైరెక్టర్లు రాజమౌళి, పూరి జగన్నాథ్, పవన్ కల్యాణ్, ఇండియన్ ఐడోల్ రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
పూరీ జగన్నాథ్ మూవీ ‘రోగ్’ ఇప్పుడే చూశా. ఈ చిత్రంలో కథ ఉండి ఉంటే చాలా బాగుండేది. తాను పూరీ కోసం అమెరికా ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో ఓ సీటు బుక్ చేశాను. పెట్ట బేడా సర్దుకుని వచ్చేయ్.. సినిమా తీయం నేర్చుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు.అలాగే పవన్ పై వ్యాఖ్యానిస్తూ పాలిజమ్ ను పవనిజమ్ తో పోల్చకండి. పవనిజమ్ కేవలం స్టేట్ లెవెల్ లో మాత్రమే హైలెట్ అయింది. కాని పాలిజమ్ కు ప్రపంచవ్యప్తంగా గుర్తింపు ఉంది అన్నారు. ఇక రాజమౌళిపై వ్యాఖ్యానిస్తూ.. బాహుబలి2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాగా ఖర్చుపెట్టి ఉండొచ్చు. కాని టీడీపీ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఇంకా ఖర్చుపెట్టి మిమ్మల్ని దాటేసింది అన్నారు.
ఐక్యూ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ వరల్డ్ లోనే టాప్ 3లో ఉంటాడు. కాని నేను ఐన్ స్టీన్ ఐక్యూ స్థాయిని ఎప్పుడో దాటేశానని కామెంట్ చేశారు. అలాగే ఇండియన్ ఐడోల్ రేవంత్ ని ఉద్దేశించి కూడా ట్వీట్ చేశారు. బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలని రేవంత్ నన్ను అడిగాడని అన్నారు. ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొనమని చెప్పానని తెలిపారు. తాను నెగ్గుతానా.. ? అంటూ రేవంత్ అడిగాడని.. అయితే పోటీలో నిలబడి టైటిల్ పట్టుకెళ్లమని చెప్పానని ట్విట్టర్ లో తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.