కబాలి.. అరుదైన ప్రచారం!
రజనీ కాంత్ హీరోగా నటించే కబాలీ సినిమా రిలీజ్ కాకముందే రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే సినిమా టీజర్, నిరుప్పుడా సాంగ్, ఫస్ట్ ఫోస్టర్లతో కోట్లమంది అభిమానులను ఆకట్టుకుని పలు రికార్డులను సొంతం చేసుకోగా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకునేందుకు ఆ సినిమా రెడీ అవుతోంది. ఇప్పటికే చెన్నై నిండా భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో నిండిపోయాయి. ఇప్పుడు విమానాలపై సినిమా పోస్టర్లు అంటించి ప్రచారం చేయడంతో ‘కబాలీ’ మేనియా ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఏయిర్ ఏషియా విమానాలపై కబాలీ పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్ తో పాటు, మరో రెండు అంతర్జాతీయ విమానాలకు కబాలి పోస్టర్స్ వేశారు.
గతంలో దేశంలో ఏ చిత్రానికి లేని తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న తొలి ఇండియన్ మూవీగా కబాలీ సెన్సెషన్ గా నిలువనుంది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు. కాగా సినిమా విడుదల కాకముందే ఇన్ని రికార్డులు సొంతం చేసుకుంటుంటే విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.