వెంకటేష్ తో రొమాన్స్ చేయనున్న కాజల్ అగర్వాల్.. ?
టాలీవుడ్ లో మల్లీ స్టారర్ సినిమాల చేయాలంటే దర్శకులకు ఫస్ట్ ప్రిపరెన్స్ విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం ఆయన సోలో హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘బాబు బంగారం’. ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే.. ఓ పక్క చిత్రీకరణ జరుగుతుండగానే మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారు. నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్ లో నటించనున్నారు. మరోవైపు.. ఆ సినిమాకి సంబంధించి ప్రీ పొడక్షన్ వర్క్ నడుస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే వెంకీ సరసన నటించేందుకు ఓ క్యూట్ హీరోయిన్ ఎంపిక చేశారని సమాచారం. ఇంతకీ ఎవరనేగా మీ డౌట్..? ఇప్పటి వరకు యంగ్ హీరోల పక్కన మాత్రమే నటించిన కాజల్ ఈ సారి సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఈ వార్త కాస్తా బయటకు పొక్కడంతో వెంకీ – కాజల్ ది సెన్సేషనల్ కాంబినేషన్ అంటూ ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. ప్రస్తుతం కాజల్ బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. అలాగే సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ తో బిజీ బిజీగా ఉంది. ఇక వెంకీ కూడా ‘బాబు బంగారం’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. వీరిద్దరి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నయా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇక కిశోర్ తిరుమల డైరెక్షన్ తెరకెక్కనున్న సినిమాని మల్టీ డైమన్షన్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.