Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kala Kaisa Nam Hai re

By   /  March 3, 2018  /  Comments Off on Kala Kaisa Nam Hai re

    Print       Email

`కాలా` కైసా నామ్ హై రే!

InCorpTaxAct
Suvidha

 

 

 

 

“కాలా కైసా నామ్ హైరే..  నాన‌ప‌టేక‌ర్ చెప్పిన డైలాగ్ వెంట‌నే.. కాలా అంటే ఎవ‌రు కాలుడు క‌రికాలుడు గొడ‌వ ప‌డైనా స‌రే కాపాడేవాడు“ అంటూ మొద‌లైన `కాలా` టీజ‌ర్  సోష‌ల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తోంది.

ర‌జ‌నీ కాంత్ ఫ్యాన్స్ అయితే పండ‌గ చేసుకుంటున్నారు. తలైవా మరోసారి మాఫియా డాన్‌ పాత్రలో అద‌ర‌గొట్టార‌ని అంటున్నారు. “కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు”, “క్యారే సెట్టింగా.. వీరయ్య బిడ్డను రా ఒక్కడినే ఉన్నా.. ధిల్లుంటే గుంపుగా రండిరా” “ఈ కరికాలుడు పూర్తి రౌడీ ఇజాన్ని ఎప్పుడూ చూడలేదు కదూ ఇప్పుడు చూపిస్తా” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌లు అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాయి.

అయితే రజినీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ టీజర్ మార్చి 1న రిలీజవుతుందని ముందు ప్రకటించారు. కానీ ముందు రోజు జయేంద్ర సరస్వతి మరణంతో టీజర్ లాంచ్ వాయిదా పడింది. మార్చి 2న ఉదయం 10 గంటలకు టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం చూశారు. కానీ గురువారం రాత్రి ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చడీచప్పుడు లేకుండా టీజర్ ట్విట్టర్లోకి వదిలేశాడు నిర్మాత ధనుష్. ఈ చిత్రంలో రజనీ సరసన ఈశ్వరీ రావు నటించగా.. నానా పటేకర్ విలన్‌గా కనిపించనున్నారు. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →