Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Kalahasti is going to ring the bell (ganta)

By   /  July 15, 2016  /  Comments Off on Kalahasti is going to ring the bell (ganta)

    Print       Email

ganta`కాళ‌హ‌స్తి`గా వ‌స్తున్న గంటా త‌న‌యుడు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు తనయుడు రవి ఘంటా హీరోగా ప్రశాంత్ సమర్పణలో శారద ఆర్ట్స్ బ్యానర్‌పై దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో అనిల్‌కుమార్ కిశన్ నిర్మాతగా వ‌స్తున్న చిత్రం `కాళ‌హ‌స్తి`.  ఈ చిత్రం ప్రారంభోత్స‌వం నిన్న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ‘మంచి కోసం దూసుకెళ్తా..ఎవడు అడ్డొచ్చినా తాటతీస్తా’ అనే డైలాగ్‌ను ముహుర్తం షాట్‌గా చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు క్లాప్‌కొట్టారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘ వేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ – ”చాలా కథలు విన్నాను. అన్నీ నాకు రొటీన్‌గా అనిపించాయి. అప్పుడు ధీన్‌రాజ్‌గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రియలిస్టిక్ కథ. సూపర్‌హీరో కథ కాదు. ఓ జెన్యూన్, రియల్ హీరో కథ వినగానే ఇలాంటి కథే నాకు కావాలనిపించింది. అలాంటి సమయంలోనే నేను రవిని కలిశాను. నా కథకు ఇలాంటి హీరోనే కావాలనుకున్నాను. సినిమా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. రవిలాంటి ఓ హీరోను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేక్షకులను థ్రిల్ చేసే మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, పోసాని వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెలాఖరున సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. వైజాగ్, కాళహస్తిలో ఎక్కువ భాగం చిత్రీకరిస్తాం. సాంగ్స్‌లో రెండు సాంగ్స్‌ను విదేశాల్లో చేసేలా ప్లాన్ చేశాం. రెండు మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →