Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kaleshwaram Has Cultivated 37 Lakh 9,000 Acres

By   /  March 22, 2018  /  Comments Off on Kaleshwaram Has Cultivated 37 Lakh 9,000 Acres

    Print       Email

కాళేశ్వ‌రం ద్వారా 37 ల‌క్ష‌ల 9వేల ఎక‌రాల‌కు సాగునీరు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* తాగునీటి అవ‌స‌రాల‌కు నీటిని అందిస్తాం

* తెల‌గాణ‌ను కోన‌సీమ‌గా మారుస్తాం

* వందేళ్ల త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల‌కు టీఆర్ఎస్ గుర్తుండేలా చేస్తాం

* రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

డెక్క‌న్ అబ్రాడ్‌:  టీఆర్ఎస్ పార్టీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల క‌న్నా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. వందేళ్ళ తర్వాత కూడా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకునే విధంగా సాగునీటి రంగంలో పనులు  సాగుతున్నట్టు చెప్పారు. అసెంబ్లీలో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల 9 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీటిని అందిస్తామ‌న్నారు. కాళేశ్వరం లింక్ 1 లో మూడు బ్యారేజీ లు,మూడు పంప్ హౌస్‌లను అతి తక్కువ వ్యవధిలో 20 నెలల్లోనే పూర్తి చేస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు. కాళేశ్వరం పనులు మూడు షిఫ్టులలో వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. గత ఆరు నెలల్లోనే 2 కోట్లకు పైగా సిమెంట్ బస్తాలు వాడినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. సీఎం కేసీఆర్ ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ద్వారా కాళేశ్వరం పనులను పర్యవేక్షిస్తూ, సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు.

ప్రస్తుత వేసవికాలంలోనూ జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలకు నీరు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏ ప్రాజెక్టులను చేపట్టలేదన్నారు. నీటి లభ్యత ఆధారంగానే ఐదు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశా మన్నారు. రీడిజైనింగ్ తర్వాత కాళేశ్వరం కింద 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాలకు ఆయకట్టు అదనంగా  పెరిగిందన్నారు. పాల మూరు ప్రాజెక్టు కట్టకపోతే తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసినట్లు అవుతుందని ఇరిగేషన్ మంత్రి వ్యాఖ్యా నించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తేనే భవిష్యత్ తరాలకు న్యాయం చేసిన వాళ్లమవుతామని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టును కట్టుకుంటేనే కృష్ణా జలాల కేటాయింపుల్లో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలను వంచించి కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ పెద్ద ఎత్తున ధనార్జనకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల విధానాన్ని, ఈపీసీ పద్ధతిని రద్దు చేసిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. కృష్ణా, గోదావరిలో ప్రతి నీటి చుక్కును వాడుకుంటామని, ఒక్క చుక్క కూడా వృథా పోనివ్వమని చెప్పారు. కృష్ణా, గోదావరి నుంచి  తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌లో మన వాదనలు బలంగా వినిపిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. కేసు ట్రైబునల్‌లో ఉన్నందును కొన్ని విషయాలు అసెంబ్లీలో వెల్లడించడం సాధ్యం కాదని మంత్రి వివరించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →