Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kalikho Pul, Removed As Arunachal Chief Minister Weeks Ago, Found Hanging..

By   /  August 9, 2016  /  Comments Off on Kalikho Pul, Removed As Arunachal Chief Minister Weeks Ago, Found Hanging..

    Print       Email

Kalikho Pulఅరుణాచల్ మాజీ సీఎం ఆత్మహత్య..
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికోపుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఉదయం కలికోపుల్ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
2015 చివరివరకు కాంగ్రెస్ తో ఉన్న పుల్.. మెజార్టీ సభ్యులతో కలిసి తిరుగుబాటు చేసి బీజేపీ అండతో ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 19 ఫిబ్రవరి 2016 నుంచి 13 జులై 2016 వరకు కొన్ని నెలల పాటు సీఎంగా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో పదవి కోల్పోయారు.

రాజీనామా చేసినా ప్రస్తుతం ఇటానగర్ లోని అధికారిక నివాసంలో ఉంటున్నారు. తన ఇంటిని పునరుద్ధరణ చేస్తూండటంతో తాత్కాలికంగా అధికారిక నివాసంలోనే ఉంటున్నారు. అయితే మంగళవారం ఉదయం అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →