Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kamal Hassan decided to stop movies

By   /  February 14, 2018  /  Comments Off on Kamal Hassan decided to stop movies

    Print       Email

సినిమాలకు గుడ్ బాయ్ : కమల్ హాసన్

InCorpTaxAct
Suvidha

 

 

భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు కమల్ హాసన్. ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నట కమలం, పద్మభూషణుడు, ప్రముఖ నటుడు, 63 ఏళ్ల కమలహాసన్ భవిష్యత్తులో సినిమాలు చేయబోనని సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు కమల్ రెండు నెలల క్రితమే ప్రకటించారు. ఈ నెలలో పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించనున్నారు. త్వరలో విడుదల కానున్న రెండు సినిమాలు మినహా ఇకపై సినిమాలు చేయను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

గత 37 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్నా. ఈ కాలంలో 10 లక్షల మంది నమ్మకమైన కార్యకర్తలను సమీకరించాం. నా ఆదేశాలతో వారు మరెంతో మందిని ఇందులో భాగస్వాములను చేశారు అని కమల్ తెలిపారు. మరో తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ కూడా పార్టీ ఏర్పాటు చేయనుండడంతో ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉందా.. అని అడిగిన ప్రశ్నకు… రజనీకాంత్ రాజకీయాలు కాషాయమైతే ఎటువంటి కూటమి కట్టేది లేదని స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →