Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Kamal Hassan Sensational Comments On Dinakaran Case Filed

By   /  January 6, 2018  /  No Comments

    Print       Email

దినకరన్‌ పై కమల్ మరో సంచలన వ్యాఖ్య..!

 

Suvidha
Biryani Pot

 

 

 

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నియోజకవర్గం అయిన ఆర్కేనగర్ లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ప్రతిపక్ష హోదాలో ఉన్న డీఎంకే వర్గాల మద్య పోటీ ఉంటుందని అనుకున్నారు.. కానీ అందరికీ షాక్ ఇస్తూ అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ గెలుపొందారు. ఇక తమిళనాడులో గత కొంత కాలంగా పాలిటిక్స్ బ్రష్టు పట్టిపోయాయని తాను త్వరలో పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వస్తానని ఆ మద్య విశ్వనటుడు కమల్ హాసన్ చెప్పారు. ఇప్పటికే పలు రాజకీయాంశాలపై తనదైన విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ ఆనంద వికటన్‌ కోసం రాసిన వ్యాసంలో కమల్‌ వ్యాసం ద్వారా దినకరన్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆర్కేనగర్‌ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని కమల్‌ ఆ వ్యాసంలో రాశారు. కమల్‌ చేసిన ఈ విమర్శలు దినకరన్‌ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. దినకరన్‌తోపాటు ఆర్కే నగర్‌ ఓటర్లను కమల్‌ అవమానించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కమల్‌పై కేసు నమోదు అయ్యింది. జనవరి 12న ఈ కేసు విచారణకు రానుంది. దీనిపై స్పందించిన కమల్ హాసన్.. నాపై కేసు నమోదైన ఫర్వాలేదు. వెనక్కి తగ్గను. న్యాయపరంగానే నేను వాటిని ఎదుర్కుంటా అని మీడియాకు కమల్‌ బదులిచ్చారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Invitation For World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st Houston, TX

Read More →