Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Kangana Renaut shares her fitness secret.. Video..

By   /  March 9, 2016  /  Comments Off on Kangana Renaut shares her fitness secret.. Video..

    Print       Email

kangana ranauth

కంగనా రనౌత్ ఫిట్ నెస్ వీడియో..

InCorpTaxAct
Suvidha

 

బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ ఏం చేసినా వెరైటీనే. తెర మీద ఆమె చేసే పాత్రలు.. బయట ఆమె మాట్లాడే మాటలు ఏవైనా సెన్సేషన్ క్రియేట్ చేసేస్తుంటాయి.రీసెంట్ గా ఈ అందాల తార ఓ వీడియోతో తన అభిమానుల్ని పలకరించింది. ఫిట్ నెస్ మీద ఆమె రూపొందించిన తాజా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో డాన్స్ – యోగా – కిక్ బాక్సింగ్.. లాంటి రకరకాల విద్యల్ని ప్రదర్శించింది. ఇక చూసిన వారు కంగనా పెర్మార్ మెన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.మంచి ఫిజిక్ తో కంగనా ఆ విన్యాసాలు చేస్తుంటే చూడముచ్చటగా ఉన్నట్లుంది.

ఫిట్ నెస్ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉండాలో చెప్పడంతో పాటు తన జీవితంలో ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొంది.. ఫెయిల్యూర్లను అధిగమించి.. ఎలా నిలబడింది.. తన ఇన్నర్ స్ట్రెంత్ ఎలా డెవలప్ చేసుకుంది.. ఈ విషయాలన్నీ కూడా వివరించింది వీడియోలో కంగనా. ఆమె ప్రస్తుతం ఫేమస్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘రంగూల్’లో నటిస్తోంది. షాహిద్ కపూర్ – సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా నటిస్తున్నారు. 1940 కాలంలో సాగే ప్రేమకథ ఇది. క్వీన్ – రివాల్వర్ రాణి లాంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న కంగనా.. ఈ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఇందులో ఆమెది ఓ నటి పాత్ర అని సమాచారం. ఇక ఇప్పటికే కంగనా రివాల్వర్ రాణిగా బాగా ఫేమస్ అయిపోయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →