Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Kanimoli denys Radha Ravi comments in Facebook..

By   /  March 5, 2017  /  Comments Off on Kanimoli denys Radha Ravi comments in Facebook..

    Print       Email

kanimoliరాధా రవి వ్యాఖ్యలను ఖండించిన కనిమొళి..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇటీవలె రాధారవి అనే తమిళ నటుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె.స్టాలిన్ సమక్షంలో డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారు.ఆయన మొదట డీఎంకేలో తర్వాత అన్నాడీఎంకే లో ఉన్నారు. ఈ మధ్య అన్నాడీఎంకే లో పరిస్థితుల నేపథ్యంలో తిరిగి డీఎంకే గూటికి చేరారు. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. పార్టీ సమావేశంలో పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామ్ దాస్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని మానసిక వ్యాధిగ్రస్తులతో పోల్చారు.

ఈయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి స్పందించారు. ఫేస్ బుక్ లో ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. వైకల్యం శారీరకమైనా, మానసికమైనా అది లైఫ్ లో చిన్న అడ్డంకి మాత్రమేనని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను కరుణానిధి అభిమానులు అంగీకరించరని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →