Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Kannada movie Rose Dubbed in telugu as ‘Pantulu gari ammai’

By   /  February 27, 2016  /  Comments Off on Kannada movie Rose Dubbed in telugu as ‘Pantulu gari ammai’

    Print       Email

pantulu gari ammai 1

‘పంతులుగారి అమ్మాయి..’ గా కన్నడ మూవీ ‘రోజ్’
కన్నడలో సూపర్ హిట్ అయిన మూవీ ‘రోజ్’. ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో డబ్బింగ్ అవుతోంది. మూవీ టైటిల్ గా పంతులుగారి అమ్మాయి అని డిసైడ్ చేశారు. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇతర ప్రధాన పాత్రల్లో కృష్ణ అజయ్ రావు, శ్రావ్య, బుల్లెట్ ప్రకాష్, సాధు కోకిల నటించారు. ఈ సినిమాని సహన హెచ్.ఎస్ డైరెక్ట్ చేశారు. శ్రీమతి చంద్రకళ సమర్పణలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వరప్రసాద్ నిర్మిస్తున్నారు.శ్రీమతి అంచాల రాజేశ్వరి-ముద్దం రామచంద్రుడు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

InCorpTaxAct
Suvidha

అనూప్ సిలీన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియో రీసెంట్ గా లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది. ఇటీవల హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సాగర్, ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ అతిధులుగా పాల్గొన్నారు. చిత్ర నిర్మాత వరప్రసాద్, సహ నిర్మాత ముద్దం రామచంద్రుడు, రవిరెడ్డి, ఈ చిత్రానికి మాటలు మరియు పాటలు రాసిన శ్రీ సాయి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సాగర్ ‘పంతులు గారి అమ్మాయి’ ఆడియోను రిలీజ్ చేసి ఫస్ట్ సీడీని ప్రసన్నకుమార్ కు అందించారు. శివాజీ హీరోగా రూపొందిన ‘దొరకడు’తో సినిమా నిర్మాణం లోకి అడుగుపెట్టిన చంద్రకళా ఆర్ట్ క్రియేషన్స్.. ఆ తర్వాత ‘దందుపాళ్యమ్ అలజడి’ అనే డబ్బింగ్ మూవీని అందించింది. తర్వాత పంతులుగారి అమ్మాయి తమ సంస్థ నుంచి వస్తున్న మూడవ చిత్రమని నిర్మాత వరప్రసాద్ అన్నారు.

ఈ సినిమాకి మాటలు: శ్రీసాయి, పాటలు: శ్రీసాయి- శ్రీమతి వెల్లంకి విజయలక్ష్మి, సహ నిర్మాతలు: శ్రీమతి అంచాల రాజేశ్వరి-ముద్దం రామచంద్రుడు, సమర్పణ: శ్రీమతి చంద్రకళ, నిర్మాత: వరప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే -దర్సకత్వం: సహన హెచ్.ఎస్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →