Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Karnataka Assembly Elections will decide the future of Indian Elections

By   /  March 28, 2018  /  Comments Off on Karnataka Assembly Elections will decide the future of Indian Elections

    Print       Email

క‌ర్నాట‌క‌లో మోగిన ఎన్నిక‌ల న‌గారా

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ఏప్రిల్‌ 17న నోటిఫికేషన్‌.. ఏప్రిల్‌ 24న నామినేషన్ల దాఖలు, పరిశీలన 25న

* మే 12న ఎన్నికలు, 15న ఓట్ల లెక్కింపు

* షెడ్యూల్‌ను ముందే ప్ర‌క‌టించిన బీజేపీ

* వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు

డెక్క‌న్ అబ్రాడ్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఏప్రిల్ 17న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేస్తార‌ని, అప్ప‌టి నుంచి రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 24 వ‌ర‌కు నామినేష‌న్లుదాఖ‌లు చేసుకోవ‌చ్చ‌ని, 25న ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించింది.  మే 12వ తేదీ పోలింగ్ ఉంటుంద‌ని, మే 15న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంద‌ని పేర్కొంది. 224 మంది సభ్యులు గల ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 28తో ముగియనున్నది. ఇదిలా ఉంటే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం ఎన్నికల కమిషన్‌ ప్రకటించడానికి ముందే బీజేపీ ఐటి సెల్‌కు నేతృత్వం వహిస్తున్న అమిత్‌ మాలవ్య ఎన్నికల తేదీలను ట్వీట్‌ చేశారు. ఒక న్యూస్‌ ఛానల్‌ను ప్రస్తావిస్తూనే తాను షెడ్యూల్‌ను ట్వీట్‌ చేసినట్లు మాలవ్య చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపి రావత్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న సమయంలో ఈ ట్వీట్‌ వెలుగుచూసింది. అప్పటికింకా ఎన్నికల కమిష నర్‌ తేదీలను ప్రకటించలేదు. అమిత్‌ మాలవ్య తన ట్వీట్‌లో ఎన్నికలు మే 12న జరుగు తాయ ని, ఓట్ల లెక్కింపు మే 18న జరుగుతుంద ని పేర్కొన్నారు. అయితే ఎన్నికలు జరిగే తేదీని అయన సరిగానే చెప్పినప్పటికీ ఓట్ల లెక్కింపు తేదీని తప్పు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన మేరకు మే15న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ముందుగా లీకైన విషయాన్ని ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన దీనిని తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు జరిపి నిందితులపై చట్టపరంగాను, పాలనాపరంగాను కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘ట్వీట్‌’ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ ఖచ్చితమైనది కాదని, ఓట్ల లెక్కింపు మే 18న జరుగుతుందని, మే 15న కాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. లీక్‌ అయినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్‌కు చెందిన సోషల్‌ మీడియా హబ్‌ దర్యాప్తు జరుపుతున్నదన్నారు రాజకీయ పార్టీలు, నేతలు ఉపయోగించే మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా వినియోగదారుని సమాచారాన్ని తమ సోషల్‌ మీడియా హబ్‌ పరిశీలిస్తున్నదని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →