Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Karnataka BJP releases first list of 72 Candidates

By   /  April 9, 2018  /  Comments Off on Karnataka BJP releases first list of 72 Candidates

    Print       Email

తొలివిడ‌త‌గా 72 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ఎడ్యూర‌ప్ప‌

* అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన‌ కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా

* ఏప్రిల్ 24 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌

డెక్క‌న్ అబ్రాడ్‌: క‌ర్నాట‌క‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌న తొలివిడ‌త జాబితాలో 72 మంది పేర్ల‌ను  ప్ర‌క‌టించింది.  కర్ణాటకలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీఎస్ ఎడ్యూరప్ప నిలుచోనున్నారు. శికారిపుర ప్రాంతం నుండి ఆయన పోటీ చేయనున్నారు. కాగా బీజేపీ అభ్య‌ర్థుల పేర్ల‌ను కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా ప్ర‌క‌టించారు. కాగా ఈనెల 24వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ ప‌త్రాలు తీసుకోవ‌డం జ‌రుగుతుంది ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలిపింది. . ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. ఏప్రిల్ 27వ తేదీన‌ నామినేషన్ నుండి విరమించుకోవడానికి ఆఖరు తేది కావ‌చ్చు. కాగా మే 12వ తేదీ నుండి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేదీ నుండి కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి.

ఈసారి ఈవీఎం మెషిన్లతో పాటు వీవీపాట్ మెషీన్లను ఓటర్లకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 17వ తేదిన వెలువడుతుంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అదే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మంచి పోటీనే నెలకొంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఉంది. 122 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →