హాలీవుడ్ విలన్ రేంజ్ లో కార్తీ..?
ఈ పోస్టర్ని చూశారా? ఏదో హాలీవుడ్ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది కదూ..! కాని ఆ పోస్టర్ లో ఉన్న యాక్టర్ ని గుర్తు పట్టారా..? హాలీవుడ్ విలన్ లా కనిపిస్తున్న ఆయన మరెవరో కాదు.. ప్రముఖ తమిళ హీరో కార్తి. ఈ యంగ్ హీరో కూడా తన అన్న సూర్యాను అనుసరిస్తున్నాడు. సూర్యాతో సమానంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ, తెలుగు బాషల్లో తెరకెక్కుతున్న ‘కాష్మోరా’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పోస్టర్ లో ఇదిగో ఇలా కనిపిస్తున్నాడు.
‘కాష్మోరా’ ఫస్ట్‌లుక్ తాజాగా రిలీజ్ అయింది. అందులో కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఫస్ట్‌లుక్ గురించి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. కార్తీ ఓ విలక్షణ నటుడు అని వారి చర్చల సారాంశం. మరి ఫస్ట్ లుక్ తోనే అదరగొడుతున్న కార్తీ.. సినిమాలో ఇంకెలా కనిపిస్తాడోనని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ టాలీవుడ్ లో రిలీజ్ చేస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.