Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Karunanidhi played cricket

By   /  March 1, 2018  /  Comments Off on Karunanidhi played cricket

    Print       Email

క‌రుణానిధి క్రికెటాడారోచ్‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇది రాసేవాడు ఏమైనా క‌ల‌గ‌న్నాడా? లేక మా క‌ళ్ల‌ల్లో పూలు పెట్టాల‌నుకుంటున్నాడా? అని మీరు అనుకుంటున్నారు క‌దా. అనుకున్నా ప‌ర్లేదు ఇది నిజంగా నిజం. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి అనారోగ్యంతో ఇంటిప‌ట్టునే ఉంటున్నాడు. వీల్ చైర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడని అంద‌రికీ తెలుసు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాల‌ని త‌న కొడుకు స్టాలిన్‌కు సూచ‌న‌లిస్తూనే స‌ర‌దాగా క్రికెట్ కూడా ఆడుతున్నారు. క‌రుణానిధి క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే.
94 ఏళ్ల వ‌య‌స్సున్న‌ క‌రుణానిధి తన ఇంట్లోనే వీల్ చైర్‌లో కూర్చొనే క్రికెట్ ఆడారు. అలాగే కూర్చొనే తన ముని మనవడితో క్రికెట్ ఆడేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. కరుణానిధి కుర్చీలోనే ఉండి బౌలింగ్ చేయగా… ముని మనవడు బ్యాటింగ్ చేశాడు. పక్కనే ఇద్దరు మహిళలు బాల్ అందించారు. ఈ సీన్‌ను ఇంట్లో వాళ్లే తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌డం గ‌మ‌నార్హం.
కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న చాలా ఆరోగ్యంగా ఉన్నార‌ని చెప్ప‌డానికే ఈ వీడియోను ఆయ‌న కుటుంబ స‌భ్యులే సోష‌ల్ మీడియాలో పెట్టార‌ట‌. వీడియోలో క‌రుణానిధి చాలా ఉత్సాహంగా కనిపించారు. డీఎంకే కార్యకర్తలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు తమ అధినేత ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉన్నాడని డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →