Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Katamarayudu’ third song release.. Video

By   /  March 13, 2017  /  Comments Off on ‘Katamarayudu’ third song release.. Video

    Print       Email

katamarayuddu‘కాటమరాయుడు’ థర్డ్ సాంగ్ రిలీజ్..

 

InCorpTaxAct
Suvidha

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాటమ రాయుడు’. ఈ మూవీ ఆడియో సాంగ్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఫుల్ క్రేజ్ సంపాదించాయి. తాజాగా మూడో పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట ‘ రాజులైనా, బంటులైనా, కూలి అయినా,యాపారులైనా..’ అంటూ సాగుతుంది. ముఖ్యంగా ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది.

ఇక ‘కాటమరాయుడు’ టీజర్ మరో అరుదైన రికార్డును సాధించింది. ఏకంగా కోటి వ్యూస్ ను దక్కించుకుంది. ఈ టీజర్ ఫిబ్రవరి 4న యూ ట్యూబ్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆదివారానికి ఏకంగా కోటి వ్యూస్ దాటేసింది. అంతేకాకుండా 2 లక్షలకు పైబడి లైకులు సాధించింది. ఈ టీజర్ పవన్ కెరీర్ లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడం విశేషం. ఈ చిత్రాన్ని ఓ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. పవన్ సోదరులుగా శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజు, అలీ నటిస్తున్నారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →