‘జనతా గ్యారేజ్’కి కాజల్ షాక్..?
ఇటీవల కాజల్ కు వైఫల్యాలు ఎక్కువయ్యాయి. వరుసగా మూడు వైఫల్యాల తర్వాత ఈ ముద్దుగుమ్మ ‘జనతా గ్యారేజ్’ లో కనిపించబోతోంది. మొదటిసారిగా ఓ ఐటెమ్ సాంగ్ లో నర్తించబోతోంది. అయితే ఈ అందాల తార వల్ల ‘జనతా గ్యారేజ్’ మూవీకి ఓ చిక్కు వచ్చిపడిందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పంతం పట్టి మరీ కాజల్ ను ఐటెమ్ సాంగ్ కి పెట్టించారు. అయితే ఆమె షూటింగ్ స్పాట్ నుంచి కోపంగా వెళ్లిపోయిందట. తర్వాత కాజల్ ఎయిర్ పోర్టులో కనిపించింది.
అంతలా కాజల్ కు కోపం రావడానికి కారణం.. తాను నటించే సాంగ్ లో దుస్తులకు సంబంధించి కొన్ని షరతులు పెట్టిందని తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో తడిసిన తెల్లటి దుస్తులు వేసుకోనని ఖచ్చితంగా చెప్పిందట. అయినా అవే దుస్తులు ఇవ్వడంతో ఆమెకు కోపం తన్నుకొచ్చింది. సాంగ్ లో కేవలం నాలుగు జతల దుస్తులు మాత్రమే వాడతానని చెప్పిందట. పాట మొత్తంలో ఒక్కసారి మాత్రమే అందాల ప్రదర్శన.. అదీ అభ్యంతరం లేని ప్రదేశాలలో మాత్రమే చూపిస్తానని చెప్పిందట. కాని షూటింగ్ లో ఇందుకు భిన్నంగా జరగడంతో కాజల్ అలిగి వెళ్ళిపోయిందని ప్రచారం సాగుతోంది.
మూడు రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొంది కాజల్. కాని దుస్తుల వంకతో షూటింగ్ మధ్యలోనే కోపంగా వెళ్లిపోవడంతో దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. మరి.. కాజల్ అలక వీడి షూటింగ్లో పాల్గొంటుందా అన్నది తెలియాలంటే.. కాస్త వేచి చూడాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.