బాబుకంటే కేసీఆరే బెటర్
కేసీఆర్‌కు ఏపీలో పెరుగుతున్న మద్దతు
చెప్పిన హామీలు నెరవేర్చని బాబు
అవినీతి ఆరోపణలతో చెడ్డపేరు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ మద్దతు పెరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకంటే కేసీఆరే బెటర్ అని ప్రజలు అంటున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం బాబుకు మైనస్ అయితే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్న కేసీఆర్‌కే మార్కులు ఎక్కువ పడ్డాయి. ఇదే ఎవరో చెప్పిన విషయం కాదు. ఢిల్లీకి చెందిన సెంటర్‌ఫర్ మీడియా స్టడీస్ (సిఎంఎస్) చెప్పిన నిజాలు. విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబునాయడు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సీఎంస్ ఏపీలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా వచ్చాయి. ఆశ్చర్యమేమిటంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలన బాగు చేస్తున్నారని ప్రజలు చెప్పడం గమనార్హం.
కేసీఆర్ తెలంగాణలో మంచి పరిపాలన అందిస్తున్నారని 43 శాతం మంది అభిప్రాయ పడితే చంద్రబాబు పాలన బాగుందన్న వారి శాతం 34 మాత్రమే. అంటే చంద్రబాబుకు పరిపాలనలో పాస్ మార్కులు కూడా రాలేదు. ప్రపంచానికే పరిపాలనను నేర్పానని చెప్పుకునే చంద్రబాబుకు కనీసం పాస్‌మార్కులు కూడా రాకపోవటం గమనార్హం. చంద్రబాబు పనితీరుపై సర్వే జరిపితే బాగుందని 51 శాతం మంది అభిప్రాయపడగా బాగాలేదని చెప్పిన వారు 49 శాతం. అంటే అభిప్రాయాల మధ్య తేడా కేవలం 2 శాతం మాత్రమే. అయితే ఇటీవల చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు ఎక్కువ రావడం.. రాజధాని భూములు.. ఇసుక అమ్మకాల్లో వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు రావడం బాబుకు పెద్ద మైనస్‌గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు పాలనకంటే కేసీఆర్ పాలనే బాగుందని ఏపీ ప్రజలు చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.