ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మునుముందు గడ్డకాలమే అని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతిలో బాబుకు ముప్పు తప్పదంటున్నారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లు ఉండొచ్చని విభజన చట్టంల పేర్కొన్నా చంద్రబాబు మాత్రం ఎప్పుడెప్పుడు విజయవాడకు వెళ్దామా అనే పనిలోనే ఉన్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తాజారా ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి సైతం బాబుపై ఫైర్ అయ్యాడు. ఓటుకు నోటుకేసులో చంద్రబాబు నిందితుడేనని, ‘ఓటుకు నోటు’ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద శాతం దోషి అని స్పష్టంగా తేలిందని, సంబంధిత ఫైలు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు టేబుల్ వద్ద ఉందని, ఆ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం పెట్టిన మరుక్షణమే చంద్రబాబు చేతులకు సంకెళ్లు పడటం ఖాయమని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే ఇవన్నీ చూస్తుంటే ఒక్క రఘువీరారెడ్డే కాదు విపక్షాలు విమర్శిస్తున్నట్లు ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు నిజంగానే భయపడుతున్నామోననిపిస్తోంది. ఎందుకంటే శ్రీశైలం డ్యాం నుంచి లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కారు ప్రాజెక్టులను కడుతోంది. ఇప్పటికే రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు, భూసేకరణ జరుగుతున్నాయని ఒకవేళ ఇదే పూర్తి అయితే మాత్రం రాయలసీమ, ప్రకారం, నెల్లూరు జిల్లాలు ఎడారులుగా మారడం ఖాయం. రాష్ట్రానికి సంబంధించిన ఇంత పెద్ద సమస్యను కూడా చంద్రబాబు పట్టించుకోకుండా పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడకుండా బాబు చాలా లైట్ తీసుకుంటున్నాడంటే కేసీఆర్కు భయపడుతున్నామో అని అనుకోక తప్పదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.