ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇద్దరూ రైలుపట్టాలాంటి వారు. ఇద్దరు కలిసినట్లే ఉంటారు కానీ ఎప్పటికీ కలవరు. చంద్రబాబునాయుడు కేబినెట్లో పనిచేసిన కేసీఆర్ తర్వాత కాలంలో టీడీపీ వదిలి రావడం.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పార్టీ పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే విషయం అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ నుంచి బయటకు వచ్చాక కేసీఆర్ చంద్రబాబును ఎన్ని రకాలుగా తిట్టు తిట్టారో కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ బాధ్యతలను పక్కవాళ్లకు ఇచ్చాడు. వాళ్లు చంద్రబాబును తిడుతుంటే కేసీఆర్ మాత్రం నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఖమ్మం జిల్లా.. చెరుకూరు గార్డెన్స్‌లో తెలంగాణ పార్టీ నిర్వహించిన ప్లీనరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి చంద్రబాబును తిట్టించారు.
తెలంగాణ పార్టీ ప్లీనరీ సందర్భంగా బాలమేధావి లక్ష్మీ శ్రీజకు రెండు నిమిషాలు ప్రసంగించే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. ఈ సందర్భంగా 2000 సంవత్సరంలో ఎన్డీయే సర్కారు కొత్త రాష్ట్రాల్ని ఏర్పాటు చేసే పనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించగా.. చంద్రబాబు అడ్డుపడ్డారని పేర్కొంది. టీడీపీ నుంచి బయటకు రావటానికి మేధావులు.. విద్యార్థులు.. ఎన్జీవో నేతలతో కేసీఆర్ చర్చలు ప్రారంభించారని.. ఈ విషయాల్ని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న చంద్రబాబు.. కేసీఆర్ కోరుకున్న మంత్రిపదవి ఇచ్చేందుకు రాయబారాన్ని పంపినట్లుగా పేర్కొంది. అయితే.. ఆ ఆఫర్ ను కేసీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లుగా పేర్కొన్న శ్రీజ మాటకు కేసీఆర్ పగలబడి నవ్వటం గమనార్హం. బాబు మీద ఇదొక్క విమర్శ మాత్రమే కాదు.. విజన్ 2020లో తెలంగాణ ప్రస్తావన లేకపోవటంపై కేసీఆర్ చేసిన విమర్శలు.. కరెంటు ఛార్జీలను పెంచిన సమయంలో బాబు మీద విరుచుకుపడటం.. ఇలా వీలైనన్ని సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటం కనిపించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.