వ్యవస్థలో మార్పు రావాలి
* దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి
* 70 ఏళ్లలో పాలకులు ప్రజలకు తాగునీటిని అందించలేకపోయారు
* అసమర్థ పాలన వల్లే నీటి సమస్యలు తలెత్తుతున్నాయి
*వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు జేడీఎస్‌కు మద్దతు తెలపాలి
* జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తే
* దేవెగౌడతో సమావేశ అనంతరం మీడియాతో తెలంగాణ సీఎం కేసీఆర్
డెక్కన్ అబ్రాడ్: వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. 70 ఏళ్లలో పాలకులు ప్రజల కష్టాలు పట్టించుకోలేదని, కనీసం తాగడానికి మంచినీళ్లను కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండుకూడా విఫలమయ్యాయని ఆరోపించారు. థర్డ్‌ఫ్రంట్ (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటుకోసం జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (ఏప్రిల్ 13) మాజీ ప్రధాని, జనతాదళ్ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ మేరకు దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. దేవెగౌడ్‌తో సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో మొత్తం సాగుభూమికి నీరు ఇచ్చినా 30 వేల టీఎంసీలు మిగులుతాయని, అసమర్ధ పాలన వల్లే నీటి సమస్యలు తలెత్తుతున్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తాను దేవెగౌడను కలిశానని, అప్పుడు కూడా ఆయన మద్దతు పలికారని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో సమస్యలు పరిష్కారానికి మేధోమదనం జరుగుతోందని కేసీఆర్ అన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ సాధారణ రాజకీయ ఫ్రంట్ కాదని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు జేడీఎస్‌కు మద్దతు తెలపాలని కోరారు. జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కేసీఆర్ అన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లుగా దేశంలో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై తనతో, కుమారస్వామితో కేసీఆర్ చర్చలు జరిపారని వెల్లడించారు. కీలకమైన అంశాల ప్రాతిపతికన జాతీయ స్థాయిలో ఫ్రంట్ అవసరం. కేసీఆర్ ప్రయత్నాలకు మేం అండగా ఉంటాం. ఆయన కార్యాచరణ బాగుంది. మున్ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని కలిసి నడుస్తామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యాక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.