Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

KCR Government Unique feat fetches Limca record!

By   /  May 27, 2016  /  Comments Off on KCR Government Unique feat fetches Limca record!

    Print       Email

TRSరికార్డు పుట‌ల్లో `స‌మ‌గ్ర స‌ర్వే`

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ఘ‌న‌త సాధించింది. నూత‌న రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌మ‌కు మ‌రే రాష్ట్రం సాటి రాదంటూ దూసుకుపోతున్న కేసీఆర్‌స‌ర్కార్ ఇప్పుడు మ‌రో ఘ‌న‌త సాధించి చ‌రిత్ర సృష్టించింది. 2014 ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబసర్వే నిర్వహించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ఈ సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా గుర్తించింది. ఈ మేరకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ్‌ఘోష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికెట్ పంపించారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విధానం, కార్యాచరణ, విజయవంతంగా ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా, పదిజిల్లాలలో కోట్లాది కుటుంబాల వివరాలను సేకరించి రికార్డులలో భద్రపరచడం తదితర విషయాలన్నింటినీ అందులో వివరించారు. భారతదేశంలో మరే ఇతర రాష్ట్రంలో జ‌ర‌గ‌ని విధంగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు తెలంగాణ రాష్ట్రంలో 4లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించారు.

ఉదయం 7 గంటల నుండి రాత్రి ఎనిమిదిగంటలవరకు ఈ సర్వే జరిగింది. కుటుంబసభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తిపాస్తులు, తదితర వివరాలన్నింటినీ ఈ సర్వేద్వారా సేకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడిందని లిమ్కాబుక్‌ఆఫ్ రికార్డ్సు సంస్థ తెలియచేసింది. దీనిపై టీఆర్ఎస్ నేత‌లు స్పందిస్తూ ఇలాంటి రికార్డులు ఇక‌పై చాలా వ‌స్తాయ‌ని, ఇది ఆరంభ‌మేన‌ని చెప్ప‌డం విశేషం. ఏది ఏమైనా ఇలాంటి రికార్డులు ప్ర‌భుత్వానికి బ‌లం చేకూరుస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →