బాబును ఇరుకున పెడుతున్న కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రతి విషయంలోనూ ఇరుకున పెడుతూనే ఉన్నారు. ఉద్యోగుల నియామకాల దగ్గరి నుంచి వారికి ప్రమోషన్లు.. జీతాల పెంపు ఇలా అన్నింటిలోనూ బాబును ఇరుకున పెడుతూనే ఉన్నారు. తాజాగా బీసీల విషయలోనూ బాబుకు కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం కొత్తగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ఇటీవల బీసీల కోసం కూడా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ విద్యాలయాలు నడుస్తున్నట్లే బీసీ గురుకులాలు కూడా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఎస్సీ రెసి డెన్షియల్ విద్యా సంస్థల బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌తో కలిసి బీసీ సంక్షేమశాఖ అధికారులు చర్చించాలని కూడా సీఎం ఆదేశించారు. అంతేకాదు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఆర్థికంగా చేయూతన అందించడానికి ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీలను కాపుల్లో చేర్చాలని ఉద్యమం చేపడుతున్న తరుణంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చేసుకుంటూ పోతూ బాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఏ హామీ ఇవ్వని కేసీఆర్ బీసీల అభివృద్ధికి పాటుపడుతుండడం.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుండడంతో చంద్రబాబుకు ఏమి చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారట. ఇదిలా ఉంటే టీడీపీలో ఉన్న కాపు నాయకులు మాత్రం కేసీఆర్ చంద్రబాబును భలే ఇరుకున పెడుతున్నారని సంబరపడిపోతున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.