Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

KCR is facing challenges with double bedroom scheme!

By   /  August 9, 2016  /  Comments Off on KCR is facing challenges with double bedroom scheme!

    Print       Email

2014-12-10_192127_KCR_HYdకేసీఆర్ క‌ల చెదురుతోందా?

 

InCorpTaxAct
Suvidha

 

 

కేసీఆర్‌కు డ‌బుల్ బెడ్ రూం ప‌థ‌కం క‌ష్టంగా మారుతోందా? అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నారా? నిరుపేద‌ల‌కు ఇల్లు ద‌క్కే అవ‌కాశం లేదా?  పేద‌ల ఆశ‌లు ఆవిరి అయిన‌ట్లేనా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వివ‌రాల్లోకి వెళ్లితే.. కేసీఆర్ తన హామీ మేరకు గత ఏడాది దసరా నాడు..  తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలో ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు.  ప్రతి జిల్లాలోనూ ఒక్కో నియోజకవర్గానికి నాలుగు వందల ఇళ్ల చొప్పున తొలి విడతగా నాలుగువేల ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం.. ఇంత వరకు బాగానే సాగిన యవ్వారం ఆ తర్వాత నిమ్మకు నీరెత్తిన తరహాగా మారింది. ఈ ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ జిల్లాకు చెందిన నేత కావడంతో ఇక్కడే ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా పరిణమించింది.  నిర్మల్..ఖానాపూర్.. బెల్లంపల్లి… చెన్నూరు.. ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో 881 ఇళ్లను 23 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్ కూడా దీనిలో పాల్గొనేందుకు ముందుకు రాలేదు.

ఇళ్ల నిర్మాణ వ్యయం రోజురోజుకీ పెరుగుతుండటంతో పాటు తమకు లాభంగా ఉండే 13.61 శాతాన్ని టెండర్ల నుంచి తొలగించడంతో కాంట్రాక్టర్లు భీష్మించారు. దీంతో పథకం ముందుకు సాగడం లేదు. మరోపక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం.. ప్రభుత్వం కేవలం నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేయడంతో వాటిని ఎవరికి ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని పెంచితేకానీ కాంట్రాక్టర్లు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.  ఫలితంగా కేసీఆర్ తలపెట్టిన బృహత్ యజ్ఞం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →