Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

నాయ‌కుడంటే కేసీఆరే!

By   /  April 29, 2016  /  Comments Off on నాయ‌కుడంటే కేసీఆరే!

    Print       Email

kcrఎప్పుడు ఎలా మాట్లాడాలో.. ఏ స‌మ‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో.. క్యాడ‌ర్‌ను ఎలా కాపాడుకోవాలో  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలిసినంత‌గా ప్ర‌స్తుతం ఉన్న‌రాజ‌కీయా నాయ‌కుల్లో ఎవ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు. కేసీఆర్ ఏది చేసినా ధైర్యంగా చేస్తాడు.. చేసిన ప‌నిని అంతే ధైర్యంగా చెప్ప‌గ‌ల‌డు. తాజాగా ఖ‌మ్మం జిల్లా స‌మీపంలో చెరుకూరి గాడ్డెన్స్ లో నిర్వ‌హించిన తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. అయితే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని శాఖల లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. అందులో భా గంగా, వాణిజ్యశాఖమంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ శాఖ మార్చి, ఆయనకు పశుసంవర్ధకశాఖ అప్ప గించారు. దానితోపాటు గతంలో ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను కొనసాగించారు. అయితే, బీసీ అయిన తలసాని శాఖ మార్చి అవమానించారని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. కొన్ని చానెళ్లు, పత్రికల్లో కూడా తలసాని తన శాఖల్లో పనితీరు ప్రదర్శించినప్పటికీ, ఆయన శాఖ మార్చడంపై విస్మయం వ్యక్తం చేస్తూ కథనాలు వెలువడ్డాయి.

దీనిపై కేసీఆర్ ప్లీన‌రీ వేదిక‌గా స్పందించారు. “తాను చేసిన శాఖల మార్పుపై, ముఖ్యంగా తలసాని శాఖ మార్పుపై కొంతమంది పిచ్చిమాటలు, పిచ్చి రాతలు రాస్తున్నారు. దాన్ని పట్టించుకోవలసిన పనిలేదు. వాణిజ్యశాఖ జనాలతో సంబంధం లేనిది. కాబట్టి శ్రీనివా సయాదవ్‌కు వేరే శాఖ కేటాయించా. మూడురోజుల ముందే నేను శ్రీనివాస్‌ను పిలిచి ఆ విషయం చెప్పా” అని కేసీఆర్‌ చెప్పడంతో అక్కడే ఉన్న తలసాని కళ్లు చెమ్మగిల్లాయి. తమ నాయకుడు తన రక్షణకు వస్తారని ఊహించని ఆయ న కేసీఆర్ వివరణకు ఆశ్చర్యచకితులయ్యారు. కాసేపు మాటలు కూడా రాలేదు. దీంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి కూడా కేసీఆర్ గొప్పగా చెప్పడం విస్మయం కలిగించింది. తుమ్మల నాగేశ్వరరావు నేను 25, 30 ఏళ్ల నుంచి మంచి మిత్రులం. తుమ్మల అనుభవం ఉన్న సమర్ధవంతుడైన నాయకుడు అని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలిసిన వాడే నాయ‌కుడంటూ అక్క‌డున్న సామాన్య ప్ర‌జ‌ల ద‌గ్గ‌రి నుంచి మంత్రుల వ‌ర‌కు అంద‌రూ ఇదే విష‌యాన్నిమాట్లాడుకోవ‌డం విశేషం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →