Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

KCR promised to give more reservations to minorities (muslims) in Telangana

By   /  June 26, 2016  /  Comments Off on KCR promised to give more reservations to minorities (muslims) in Telangana

    Print       Email

2014-12-10_192127_KCR_HYdముస్లింల‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

 

InCorpTaxAct
Suvidha

 

‘‘తెలంగాణలోని ముస్లిం సోదరులకు మంచి రోజులు రాబోతున్నాయి. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని నిర్ణయించాం. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే నివేదిక సమర్పించబోతోంది. నివేదిక రాగానే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి, రిజల్యూషన పాస్‌ చేస్తాం. తర్వాత పార్లమెంట్‌కు పంపి ఆమోదం పొందేలా చూస్తాం’’ అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చింది. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింలకు త్వరలోనే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయ‌డంతో పాటు ముస్లిం విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరేందుకు రూ.3900 కోట్లతో 120 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రంజాన్‌ సందర్భంగా మైనారిటీల కోసం రూ.20 కోట్లు కేటాయించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు.
పేద ముస్లిం యువతులకు షాదీ ముబారక్‌ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాగా డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ నిజాం రాజుల తర్వాత టీఆర్‌ఎస్‌ పాలనలోనే ముస్లిం మైనారిటీలకు ఎక్కువ ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలోని 2 లక్షలమంది ముస్లింలకు మూడు జతల కొత్త దుస్తులను ప్రభుత్వం అందించిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల‌కంటే ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా కృషి చేస్తోందన్నారు. అయితే కేసీఆర్ మాట‌లు కోట‌లు దాటుతాయి కానీ చేత‌లు గ‌డ‌ప దాట‌దు అన్న‌ట్లుగా ఉంటాయ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →