Loading...
You are here:  Home  >  Business News  >  Current Article

KCR requests everyone to love Telangana state

By   /  August 8, 2016  /  Comments Off on KCR requests everyone to love Telangana state

    Print       Email

2014-12-10_192127_KCR_HYdనం-1 రాష్ట్రంగా చేస్తా: కేసీఆర్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

“తెలంగాణ రాష్ట్రం కొత్త‌గా ఏర్పాటైంది. ఈ రాష్ట్రంపై మీరు ప్రేమాభిమానాలు చూపండి. మాకు అండ‌గా నిల‌వండి. తెలంగాణ‌ను దేశంలోనే నంబ‌ర్ 1 రాష్ట్రంగా చేసి చూపిస్తా“ అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని కోరారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ పూర్తిగా హిందీలోనే మాట్లాడారు. కేసీఆర్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..“ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని నల్లా ద్వారా అందించాలని రూ.42వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాం. మా ప్రయత్నాలు ఫలించి ఈ కార్యక్రమంలో తొలి అంకాన్ని ప్రధాని మోదీ సువర్ణహస్తాలతో ఆవిష్కరించడంతో మేము కన్న కల సాకారమైంది. ఈరోజు 66,800 ఇండ్లకు నల్లా ద్వారా కూర్చున్నచోటే స్వచ్ఛమైన నీరు అందుతుంది.

తెలంగాణ రాష్ర్టానికి ఈరోజు చాలా శుభదినం. అనేక మంచి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం. సింగరేణి ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల ప్లాంట్ సిద్ధంగా ఉంది. ఉత్పత్తి కూడా జరుగుతున్నది. దాన్ని మీరు జాతికి అంకితం ఇస్తున్నారు. దీని కోసం రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ రెండు కార్యక్రమాల ప్రారంభంతో పాటు పవిత్ర గోదావరి పక్కన వెలుగునిచ్చే ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఐ 17ఏండ్ల కిందట మూత పడింది. అప్పుడు బాగా నడిచింది. కొన్ని నెలల క్రితం మేం కేంద్రానికి చేసిన ప్రార్థనలతో పునరుద్ధరణకు అంగీకరించారు. రూ.5250 కోట్ల తో తిరిగి ప్రారంభిస్తున్నారు. దీనికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ప్రధానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ఇది కరీంనగర్- హైదరాబాద్ రైల్వేలైన్. స్టేషన్ల పేరు మీద మనోహరాబాద్-కొత్తపల్లి అంటున్నాం. ఈ రైల్వేలైన్ గురించి నా చిన్పప్పటినుంచి వింటున్నా… ఇన్నాళ్లకు తెలంగాణ ఏర్పడిన తరువాత మీ ప్రభుత్వంలో ఆ కల సాకారం అయింది. వీలైనంత తొందరగా ఈ పనులు పూర్తిచేసుకుందాం. దీనిపై రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నాం.  ఐటీలో ఇప్పటికే దేశంలో అగ్రభాగాన రాష్ట్రం ఉందని, నెం.1గా తీసుకెళ్లేందుకు చర్యలు  తీసుకుంటున్నాం“ అని కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. అభివృ ద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రావాలని అడిగిన వెంటనే మోదీ అంగీకరించారని, వచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాన‌న్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →