పుష్కరాలకు సాయం చేయండి
ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
తెలంగాణలో కృష్ణానది పుష్కరాలను ఆగస్టు 12 నుంచి నిర్వహిస్తున్నామని తెలంగాణ ముఖ్యమత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు జిల్లాల ద్వారా కృష్ణా నది ప్రవహిస్తోందని, అయితే పన్నెండు రోజు ల పాటు జరగనున్నాఈ పుష్కర స్నానాలను ఆచరించేందు కు అవసరమయ్యే స్నాన ఘట్టాల నిర్మాణం చేపట్టాలని, మౌలిక వసతుల కల్పనకు , నిర్వహణకు మొత్తం 802 కోట్ల 19 లక్షల రూపా యలు ఖర్చు అవుతాయని కేంద్రం వాటాగా 601 కోటి 65 లక్షల రూపాయలను విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రిని కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి భారీ కార్యక్రమాల ను ఆయా రాష్ట్రాలు నిర్వహించే సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు, రా ష్ట్రాలకు కేంద్రం అందించే వన్ టైం సెం ట్రల్ ఆసిస్టెన్స్ పద్దు కింద ఈ నిధులను విడుదల చేయాలని ప్రధానికి ఈ లేఖ ద్వారా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో దాదాపు 281 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న కృష్ణానది దేశంలోని 12 పవిత్ర జీవనదుల్లో ఒకటిగా వర్థిల్లుతున్నదని అన్నా రు. అత్యంత గొప్పగా ఇటీవల గోదావరి పుష్కరాలను నిర్వహించామని తెలిపారు. వాటిని దృష్టిలో వుంచుకొని వేసిన అంచనా మేరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాట క, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 3.5కోట్ల మంది యాత్రికులు, భక్తులు కృష్ణా పుష్క రాల్లో పాల్గొననున్నారని సీఎం ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పుష్కరా ల నిర్వహణకు అవసరమయ్యే ఆర్థిక అవసరాలు తదితర పూర్తి వివరాలతో కూడిన సమా చారాన్ని కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిందని సీఎం ప్రధానికి రా సిన లేఖలో వివరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.