Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

KCR started another spiritual ritual….

By   /  July 9, 2016  /  Comments Off on KCR started another spiritual ritual….

    Print       Email

2014-12-10_192127_KCR_HYdకేసీఆర్`ఆకుప‌చ్చ‌` య‌జ్ఞం

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు `ఆకుప‌చ్చ‌` య‌జ్ఞం చేప‌ట్టారు. హ‌రిత తెలంగాణ‌కు న‌డుం బిగించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా హ‌రిత హారం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తనతో పాటు పిడికెడు మంది మాత్ర‌మే ఉన్నార‌ని, అలా మొద‌లైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఆకుపచ్చ యజ్ఞాన్ని చేపట్టేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి పిలుపుని చ్చారు. ఒకే రోజు ఒకేసారి లక్ష మందితో ఒకేసారి 1.25లక్షల మొక్కలను నాటాడం సా హసంలాంటిదన్నారు. నాటిన ప్రతి ఒక్క మొక్క బతికించాల్సిన బాధ్యత కూడా మనదేనని అన్నారు. ఒక్క మొక్క కూడా పెరగలేదనే మాట రాకుండా వాటిని బతికించాలని కోరారు. నల్గొండ జిల్లాలో అతి తక్కువగా 5.8శాతం విస్తీర్ణం మాత్రమే ఆడవులు వున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకే రెండో దశ హరితహారం కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచే ప్రా రంభిస్తున్నట్లు చెప్పారు.  ఈ జిల్లా పోరాటాల గడ్డని పేర్కొన్నారు. జిల్లాలో విసృత్తంగా చెట్లు నాటి అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. రెండు వారాల పాటు రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ మొక్కలు నాటడంపైనే దృష్టి సారించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంపై కవులు, కళాకారులు కూడా విసృత్తంగా ప్రచారాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా నిర్వహించడంతో పాటు మొక్కలు పెరగలేదనే అపవాదు రాకుండా కూ డా చూడాలన్నారు. హరితహారంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సీఎం కేసీఆర్ ఆ కాంక్షించారు.

జిల్లాలోని కాలువల ఆధునీకరణ కోసం తక్షణమే 350 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సభలోనే సీఎం అధికారులకు అందజేశారు. మిషన్ కాకతీయతో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. తెలంగాణలో ఇక విద్యుత్ కోతలు వుండవని… భవిష్యత్‌ళో ఈ పరిస్థితి తలెత్తదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అడవులను మనం నాశనం చేయడం వల్ల నే ఇవాళ కోతులు, గ్రామాలు, పట్టణాల్లోకి వస్తున్నాయని అన్నారు. గ్రామాల్లోకి కోతులు రావడమనేది తప్పుకాదని… మనం వాటి అవాసాల్ని దెబ్బ తీయడం వల్లనే ఈ పరిస్థితి త లెత్తిందన్నారు. కోతులు అడవులకు వాపస్ పోవాలని… వానలు తిరిగి రావాలని కోరుకునే విధంగా వుండాలని చేసేందుకు హరిత తెలంగాణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చు ట్టిందని తెలిపారు. అందుకోసం మనం మొక్కలను నాటాలని తెలిపారు. మొక్కలనె పెంచి తే వర్షాలు కురుస్తాయని… దీనివల్ల అడవుల్లో వాటికి కావాల్సిన ఆహారం దొరుకుతుంద‌ని .. అప్పుడు అవి తిరిగి వెళ్ళిపోతాయని సీఎం వివరించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →