అంబేద్కర్‌కు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది:కేసీఆర్
రాజ్యాంగ నిర్మిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు తెలంగాణ సమాజం మొత్తం రుణపడి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని స్వతంత్ర్య రాష్ట్రంగా వెలుగొందుతుందంటే అనాడు అంబేద్కర్ చేసిన చట్టంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు దోపిడీ నుంచి విముక్తి పొందారంటే అది అంబేద్కర్చలువేనన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ల్యాండ్‌మార్క్‌లా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో అంబేడ్కర్ టవర్స్..సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
దళితుల కోసం ఈ ఏడాది నుంచే 100 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, దళిత విద్యార్ధినుల కోసం 25 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజిలు నిర్మిస్తామని, దళిత విద్యార్థుల కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజిలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే గిరిజన విద్యార్ధినుల కోసం 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనార్టీ విద్యార్థులకూ రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామని, కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా 250 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. దళితులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, దళితలను కాంట్రాక్టర్లుగా తయారు చేస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే చంద్రశేఖర్‌రావు కూడా చంద్రబాబు లాగా హామీలు అయితే ఇస్తున్నారుకనీ ఆచరణ సాధ్యం కావడంలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి కేసీఆర్ మాట తప్పాడని, ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించే అర్హత కేసీఆర్‌కు లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.