ఇప్పుడు అందరిలోనూ అదే భయం!
తెలంగాణ పార్టీని చాలా రోజులుగా అంటిపెట్టుకున్న కేడర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురుచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4వేలకుపైగా నామినేటెడ్ పదవులు ఉంటాయని, పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి వాళ్లకు పోస్టులు ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆందోళన అంతా ఇక్కడే . పార్టీ తరఫున ఇప్పటికే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కార్పొరేషన్ పదవులు ఇస్తుండడంతో తమ పరిస్థితి ఏంటని నాయకులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ రాక నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి మరీ దారుణం. మార్కెట్ కమిటీ పదవుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో ముందు రెడీ చేసిన జాబితాలోని పేర్లన్ని మాయం అయ్యాయంటున్నారు. దీంతో పదవుల జాతర ప్రారంభం కావడంపై సంతోషించాలో… పదవి రానందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో నేతలు ఉన్నారు.
కాగా సమర్థులైన వారిని ఎంపిక చేసి రిపోర్టులు సిద్ధం చేసుకుంటున్న మంత్రులు, సీనియర్‌నేతలకు షాక్ ఇస్తున్నారు. ఎవరు పని చేశారు. ఎవరు పనిచేయలేదు అనేదానిపై ముఖ్యమంత్రిస్వయంగా సర్వేలు చేయించుకున్నారని, దాని ప్రకారమేపదవులు ఇచ్చే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ పార్టీలోని కొందరు అంటున్నారు. కానీ పార్టీ కోసం మొదటి నుంచి నిజాయితీగా పని చేసే వారిని గుర్తించి వారికి పదవులుకట్టబెడితే సరే.. లేకుండా నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం ఎక్కడైనా నామినేనెట్ పదవులు వస్తే మాత్రం టీఆర్ఎస్లో అసంతృఫ్తి సెగలు చెలరేగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆశావహులను.. పదవి రాని వాళ్లను ఎలా శాంతింపచేయాలో కేసీఆర్ ఇప్పటికే ఒక స్కెచ్ వేసి ఉంచినట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.